కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు రేపు చేపడతానని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా సమర్థవంతంగా పని చేస్తానని అన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.