దేశ ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడంతోపాటు, ద్రవ్బోల్బణానికి పగ్గాలు వేయడం కోసం కృషి చేస్తామని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. నూతన ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీని రాజన్ ఈ రోజు ఢిల్లీలో కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే రానున్న నెలల్లో రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలని చెప్పారు.