తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని జగన్నాథపురంలో పాతభవనం కూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శిథిలాల కింద తల్లి, కుమారుడు చిక్కుకోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను తొలగించారు. శిథిలాల కింద పడిన ఏడేళ్ల బాలుడు రాజేష్ మృతి చెందాడు. తల్లి ఆదిలక్ష్మి (30) పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.