ప్రపంచయాత్రకు సై అంటున్న కుక్క
ఫరెగ్జాంపుల్.. మీరు ప్రపంచపటాన్ని ఎదురుగా పెట్టుకుని యథాలాపంగా ఓ చోట వేలు పెట్టి సెలక్టు చేశారనుకోండి. మహా అయితే ఏమవుతుంది? ఆ ప్రదేశం తాలూకు బొమ్మలను, వీడియోలను మీరు య్యూట్యూబ్లోకి వెళ్లి చూసి ఆనందించవచ్చు. అంతకు మించి.. వేలు పెట్టిన ప్రతి చోటూ వెళ్లి చూసి రావాలంటే.. సాధ్యం కాదు. కానీ ఆ కుక్క గారి సంగతి అలా కాదు. ఏడాదికోమారు.. తన ఎదురుగా ఉండే ప్రపంచపటంలో అది ఎక్కడ కాలు పెడితే ఆ ప్రదేశానికి అది అధికారికంగా వెళ్లి పర్యటించి వస్తుంది. తన సహాయకుడితో కూడా! సహాయకుడు అంటే మరో కుక్క కాదు సుమండీ.. ఒక మనిషి. అవును మరి.. ఏ కుక్కకైనా తన బ్యాంకు ఖాతాలో 993,700 అమెరికన్ డాలర్లు ఉన్నట్లయితే అలాంటి వైభోగమే సాగుతుంది.
వివరాల్లోకి వెళితే.. రష్యా వద్ద బెలారెస్ లోని బుడోచ్కా గ్రామానికి చెందిన జాన్ ఫ్యోడోరోప్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో సెటిలయ్యాడు. ఆయనకు వాలెట్ అనే కుక్క ఉండేది. ఓ సందర్భంలో దానికి జబ్బు చేసింది. చికిత్స గురించి జాన్ పట్టించుకోకపోవడంతో అది మరణించింది. తన నిర్లక్ష్యం వల్లనే అది మరణించిందని పశ్చాత్తాపపడ్డ ఫ్యోడోరోవ్ 2007లో బుడోచ్కా గ్రామానికి వెళ్లినప్పుడు.. అక్కడ వాసిలీ పొటాపోవ్కు చెందిన జూలిక్ అనే కుక్కను చూశాడు. అది అచ్చం 1950లలో చనిపోయిన తన వాలెట్నే పోలి ఉన్నదని చెప్పాడు. దానిని ఆదరించడం ద్వారా తన తప్పునకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఫ్యోడోరోవ్ అనుకున్నాడు.
ఆయన విల్లులోని చివరి కోరిక మేరకు.. ఆయన ఆస్తుల్లోంచి పైన చెప్పిన మొత్తంతో జులిక్ పేరిట లాయరు మరియా బ్యాంకు అకౌంటు ప్రారంభించారు. పైన పేర్కొన్న వసతులన్నీ ఆ కుక్కకు ఏర్పాటయ్యాయి. అది ప్రపంచ పర్యటనకు వెళ్లినప్పుడెల్లా.. దాని ప్రస్తుత యజమాని వాసిలీ పొటాపోవ్ కూడా వెళ్తుంటారన్నమాట.
అదీ కథ!
More Telugu News
-
సాయికృష్ణ డెత్ కేసు: రంగంలోకి సీబీఐ.. విజయవాడలో దర్యాప్తు ప్రారంభం
-
రూ. 500 కోట్ల ఆరోపణలు.. బీజేపీపై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
జగన్ మేనమామ కాదు, కంసమామ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి
-
వయసును కంట్రోల్ చేసే శక్తి ఆహారానికి ఉంది.. ఏ డైట్ బెస్ట్? అధ్యయనంలో కీలక విషయాలు!
-
68 ఏళ్ల వయసులో మళ్లీ విద్యార్థిగా... సైకాలజీలో పీజీ చేస్తున్న కోల్ ఇండియా మాజీ జీఎం!
-
డంపింగ్ యార్డ్ కాలుష్యంపై నిరాహార దీక్ష చేస్తా: మల్లారెడ్డి
-
ఏఐతో భారత్కు పెను ముప్పు: మైక్రోసాఫ్ట్ ఏఐ నిపుణుడి హెచ్చరిక
-
పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు..చైనా ఫోన్ల హవాకు బ్రేక్!
-
వడోదరలో శ్రీ చరణి స్పిన్ మాయ.. 197 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
-
మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి: అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
-
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 40 ఏళ్లు.. రూబీ జూబ్లీ వేడుకలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్, చంద్రబాబు
-
రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!