పంటి శుభ్రతతో గుండె పదిలం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంటి శుభ్రతతో గుండె పదిలం

మన పళ్ళను చూసి ... మన గుండె ఎటువంటిదో చెప్పేయచ్చట.  అంతలా మన పంటికీ, గుండెకీ లంకె ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి రోజూ చక్కగా పళ్ళను శుభ్రం చేసుకోవడం అంటే, గుండెను కూడా శుభ్రం చేసుకోవడమే అంటున్నారు. క్రమం తప్పకుండా రోజుకి రెండు సార్లు దంతధావనం చేసుకుని, పళ్ళను మిలమిలా మెరిసేలా చూసుకునే వారిలో గుండెపోటు తక్కువేనట. తైవాన్ కు చెందిన శాస్త్రవేత్తలు ఐదేళ్ళ పాటు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది.

పళ్ళపై పేరుకుపోయే పాచిలో వుండే బాక్టీరియాకు రక్తప్రసరణను అడ్డుకునే గుణం వుందట. దాని వల్ల గుండె కొట్టుకునే తీరులో తేడా వస్తుందనీ, ఫలితంగా గుండెపోటుకి గురికావచ్చనీ ఈ అధ్యయనం చెబుతోంది. కాబట్టి, రోజూ పళ్ళను బాగా శుభ్రం చేసుకోవడంతో బాటు, ఏడాదికోసారి దంత వైద్యుడి దగ్గరకు వెళ్లి, స్కేలింగ్ చేయించుకోవడం ఉత్తమమనీ, దాని వల్ల గుండె కొట్టుకునే తీరు లయబద్దంగా ఉంటుందనీ అధ్యయనకర్తలు సెలవిస్తున్నారు.          

More Telugu News