డబ్బింగ్ సీరియళ్ల వ్యతిరేక ఉద్యమానికి నారాయణ మద్దతు
డబ్బింగ్ సీరియళ్ల వల్ల తెలుగు టీవీ పరిశ్రమ నష్టపోతోందంటూ బుల్లితెర కళాకారులు ఉద్యమానికి దిగారు. డబ్బింగ్ సీరియళ్లను నిలిపివేయాలని కోరుతూ నటీ నటులు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఫిలిం చాంబర్స్ కార్యాలయంలో రిలేదీక్షలను ప్రారంభించారు. దీనికి సీపీఐ రాష్ర్ట కార్యదర్శి నారాయణ హాజరై దీక్షలకు మద్దతు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. తెలుగువారిగా తెలుగు సీరియళ్లనే ప్రసారం చేయాలని, పరిశ్రమను కాపాడుకోవాలని నటులు డిమాండ్ చేశారు.