15 అడుగుల ఆ తాచుపాము గర్భిణి... మాకొద్దు బాబోయ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

15 అడుగుల ఆ తాచుపాము గర్భిణి... మాకొద్దు బాబోయ్!

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలో దొరికిన తాచుపామును తాము సాకలేమని విశాఖ జూ అధికారులు చేతులెత్తేశారు. 15 అడుగుల తాచుపాము ఒకదాన్ని రంపచోడవరం ప్రాంతంలో ఈ నెల 13వ తేదీన పట్టుకున్నారు. నాలుగు గంటల పాటు శ్రమించి మరీ పట్టుకున్న ఆ పామును అటవీ శాఖాధికారులు అతి కష్టం మీద విశాఖ జూకు తరలించారు. అయితే, అక్కడ దాన్ని పరిశీలించిన వైద్యులు... ఆ పాము గర్భిణి అని గుర్తించారు. ఇది చాలా ఎక్కువ సంఖ్యలో పిల్లలను పెట్టే అవకాశం ఉందని, అవి జూలో ఉన్న ఇతర జంతువులకు ప్రమాదం కావచ్చని వైద్యులు చెప్పారు. అలాగే, ఈ పాము, పిల్లలను సాకడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని జూ అధికారులు చెప్పారు.

దీంతో అత్యంత విషపూరితమైన ఈ తాచుపామును విశాఖ, తూర్పుగోదావరి ఏజెన్సీల మధ్యలో ఉన్న దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశారు. రంపచోడవరం ప్రాంతంలో ఉన్న ఓ ఇంటి ఆవరణలోకి ఈ తాచుపాము ప్రవేశించగా, అటవీ శాఖాధికారులు దీన్ని పట్టుకోగలిగారు. సాధారణంగా ఇంత పెద్ద తాచులు ఆస్ట్రేలియాలో కనపడతాయని, బహుశా చెట్లు నరికివేయడం వల్లే ఇది నివాస ప్రాంతాల్లోకి వచ్చి ఉంటుందని అధికారులు చెప్పారు. ప్రపంచంలో అత్యంత పొడవైన, అత్యంత విష పూరితమైనది తాచుపామే.

More Telugu News