నేడు తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన రాజమండ్రి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం 3 గంటలకు కోరుకొండ మండలం గాదాల రోడ్ షో లో పాల్గొంటారు. బొమ్మూరులో 3.45 గంటలకు, రాజవోలులో 4 గంటలకు, సంపత్ నగరం, కొండగుంటూరులలో 4.30 గంటలకు, కేశవరంలో 5 గంటలకు రోడ్డు షో నిర్వహిస్తారు. అక్కడి నుంచి కలువపువ్వు కూడలి వద్ద 5.30 గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం 7.00 గంటలకు రావులపాలెం చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. తరువాత 11 గంటలకు తణుకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మొత్తం మీద జిల్లాలో చంద్రబాబు పర్యటన 53 కి.మీ. మేర జరగనుంది.

More Telugu News