క్రికెటర్ జెస్సీ రైడర్ కు గండం గడిచినట్టేనా..!?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

క్రికెటర్ జెస్సీ రైడర్ కు గండం గడిచినట్టేనా..!?

తీవ్ర గాయాల కారణంగా ఆస్పత్రిలో చేరిన న్యూజిలాండ్ క్రికెటర్ జెస్సీ రైడర్ కోమా నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం వైద్యులు అతనికి వెంటిలేటర్స్ తొలగించి, ఐసీయూలో వుంచి చికిత్స జరుపుతున్నట్టు జెస్సీ మేనేజర్ ఆరోన్ క్లీ వెల్లడించాడు. కుటుంబ సబ్యులతో, స్నేహితులతో కొద్దికొద్దిగా మాట్లాడుతున్నాడని తెలిపాడు. క్రమ క్రమంగా జెర్సీ ఆరోగ్యం కుదుటపడుతుందని చెప్పాడు. అయితే, దాడికి సంబంధించిన వివరాలు జెస్సీకి ఏమాత్రం గుర్తులేవని మేనేజర్ అంటున్నాడు.  

కాగా,  రెండు రోజుల కిందట న్యూజిలాండ్ లోని ఓ బార్ వెలుపల ఇద్దరు వ్యక్తులు జెస్సీపై దాడి చేశారు. దాంతో రైడర్ తలకు బాగా గాయాలయ్యాయి.  ఊపిరితిత్తులకు గాయాలవడంతో అంతర్గత రక్తస్రావం అయింది. ఫలితంగా జెర్సీ ఇప్పటివరకూ కోమాలోనే ఉన్నాడు. మరోవైపు దాడి కేసులో నిన్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

More Telugu News