జగన్ సంతకాలన్నీ జనం కోసం కాదు.. కోట్ల కోసమే: యనమల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ సంతకాలన్నీ జనం కోసం కాదు.. కోట్ల కోసమే: యనమల

వైఎస్సార్సీపీ అధినేత జగన్ జనాలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. ఇప్పటికే జగన్ విభజన ఒప్పందం మీద కాంగ్రెస్ తో తొలి సంతకం, బెయిల్ ఒప్పందం మీద మలి సంతకం చేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఆయన అధికారంలోకి వస్తే ఐదు సంతకాలతో తలరాతను మార్చేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని యనమల అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే పెట్టే సంతకాలన్నీ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకోవడానికేనని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన చెప్పారు.

More Telugu News