చిలీలో భూకంపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిలీలో భూకంపం

చిలీ ఉత్తర తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 6.2 గా నమోదైంది. అదే ప్రాంతంలో మరికొద్ది సేపటి తర్వాత 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. సునామీ సూచనలు లేవని ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. 10.6 కిలోమీటర్ల లోతులో చిలీ ఈశాన్య ప్రాంతంలో 74 కిలోమీటర్ల పరిధి వరకు భూకంప తీవ్రత విస్తరించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా సుమారు లక్ష మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

More Telugu News