నటి నవనీత్ కౌర్ ను దుర్భాషలాడిన శివసేన ఎంపీపై ఫిర్యాదు
సినీ నటి నవనీత్ కౌర్ ను దుర్భాషలాడి, బెదిరించిన వ్యవహారంలో శివసేన ఎంపీ ఆనంద్ రావ్ అద్సుల్, మరో ఇద్దరిపై మహారాష్ట్రలోని గడ్గే నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నటి, ఎన్సీపీ అభ్యర్ధి కౌర్ తెలిపింది. కులం, క్యారెక్టర్ పేరుతో నటిని దుర్భాషలాడి, బెదిరించిన ఆ ముగ్గురిపై నేరాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఎంపీ అద్సుల్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ప్రజల సానుభూతిని పొందేందుకే ఆమె ఇలా చేస్తోందని, ప్రజా ప్రమాణాలు ఏ మాత్రం పాటించడం లేదని అన్నారు. మోడల్, దక్షిణాది సినీ నటి అయిన కౌర్ పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. రెండేళ్ల కిందట ఎంపీ రవిరాణాను వివాహం చేసుకుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్సీపీ టెక్కెట్ తో పోటీ చేస్తోంది.