Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ నూరు శాతం కరెక్టు: జగ్గారెడ్డి

సినీనటుడు పవన్ కల్యాణ్ నూటికి నూరు శాతం కరెక్టని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. జనసేన పార్టీ ఏర్పాటు సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ను తాను ఎప్పుడూ కలవలేదని, కనీసం ఫోన్ లోనైనా మాట్లాడలేదని, అలాంటి వ్యక్తి తన భావజాలాన్ని అభినందించడం ఆనందంగా ఉందని అన్నారు. తాను ఇప్పటికీ తన మాటలకు కట్టుబడి ఉన్నానని, రాష్ట్రం సమైక్యంగా ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ విషయంలో కూడా పవన్ కల్యాణ్ నూటికి నూరు శాతం నిజాలే చెప్పాడని ఆయన అన్నారు. ఉద్యమం పేరు చెప్పి టీఆర్ఎస్ దండుకున్న డబ్బులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఉద్యమం పేరు చెప్పి జేబులు నింపుకున్నారని టీఆర్ఎస్ నేతలను జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు.

More Telugu News