స్మార్ట్ గా వచ్చేసిన స్ప్లెండర్ ఐ స్మార్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్మార్ట్ గా వచ్చేసిన స్ప్లెండర్ ఐ స్మార్ట్

హీరో కంపెనీ ప్రారంభ శ్రేణిలో చక్కని బైక్ ను విడుదల చేసింది. తనకు కాసులు కురిపించిన స్ప్లెండర్ శ్రేణిలో ఐ స్మార్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ నిజంగా చూడ్డానికి స్మార్ట్ గా ఉండడం విశేషం. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉండడంతోపాటు.. స్టాప్ అండ్ స్టార్ట్ ఐ3ఎస్ టెక్నాలజీని ఇందులో వాడారు. అంటే ఎక్కడైనా బైక్ ను బ్రేక్ వేసి నిలిపినా... లేక రెడ్ సిగ్నల్ పడి బండి ఆపినా... ఇంజన్ అలా నడుస్తూనే ఉండదు. దానంతట అదే ఆగిపోతుంది. మళ్లీ బయల్దేరాలనుకుంటే క్లచ్ నొక్కితే చాలు అదే స్టార్ట్ అయిపోతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవుతుందని, తద్వారా మైలేజీ ఎక్కువొస్తుందని కంపెనీ తెలిపింది. 100సీసీ 4స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ గల ఈ బైక్ ధర (ఢిల్లీ ఎక్స్ షోరూమ్) రూ.47,250. ఈ ఐ3ఎస్ టెక్నాలజీపై పేటెంట్ కోసం దరఖాస్తు చేశామని, భవిష్యత్తులో ఇతర మోడళ్లలోనూ దీన్ని ప్రవేశపెడతామని హీరో మోటోకార్ప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ దువా తెలిపారు.

More Telugu News