కారులో 75 లక్షలు స్వాధీనం
ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్ రోడ్డు చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో తరలిస్తున్న 75 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.