గత రెండు దశాబ్దాల్లో నక్సల్స్ చేతిలో మృతి చెందినవారి సంఖ్య 12,183
గత 20 ఏళ్ళుగా నక్సల్స్ హింస కారణంగా మరణించినవారి గణాంకాలను కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ దరఖాస్తుకు జవాబిస్తూ హోం శాఖ ఈ వివరాలు తెలిపింది. 12,183 మంది గడిచిన రెండు దశాబ్దాల్లో నక్సల్స్ చేతిలో విగతులయ్యారని పేర్కొంది. వారిలో 9,471 మంది పౌరులు కాగా, 2,712 మంది కేంద్ర, రాష్ట్ర బలగాలకు చెందిన సిబ్బంది అని వివరించింది. నక్సలైట్లు నిన్న చత్తీస్ గఢ్ లో సీఆర్పీఎఫ్ దళాలపై దాడిచేసి 11 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.