పల్లె నుంచే పాస్ పోర్ట్ సేవలు
ఇకపై పాస్ పోర్టు సేవలు పల్లెల్లోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే జిల్లా కేంద్రాల్లోని పోస్టాఫీసులకు లేదా ప్రాంతీయ పాస్ పోర్టు సెంటర్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ఇకపై ఎవరికి వారు తమ గ్రామం నుంచే పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఆ గ్రామంలో ప్రభుత్వం ఆమోదించిన ఇంటర్నెట్ సెంటర్ ఉండాలి.
ప్రభుత్వ, ప్రైవేటు సేవలను అందించే ఇంటర్నెట్ కేంద్రాల (సీఎస్సీ) ద్వారా పాస్ పోర్టు సేవలను కూడా అందించాలని నిర్ణయించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ముందుగా ఉత్తరప్రదేశ్ లోని 15 సీఎస్సీ సెంటర్లలో ఈ సేవలను ప్రారంభించనున్నామని.. ఈ నెలాఖరుకు దేశవ్యాప్తంగా ఉన్న లక్ష సీఎస్సీ కేంద్రాలలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది. ఈ కేంద్రాలలో దరఖాస్తులను ఆన్ లైన్లో పూరించడం, ఫీజు కట్టడం, పాస్ పోర్టు సేవల కోసం అపాయింట్ మెంట్ ఖరారు చేసుకోవడానికి వీలవుతుంది.