షర్మిలకు అభినందనల వెల్లువ
వైఎస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటికి వందవ రోజుకు చేరటంతో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తోన్న షర్మిలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు కలిసి తమ సంఘీభావం ప్రకటిస్తున్నారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తోన్న షర్మిలను కలిసి ప్రత్యేకంగా అభినందించారు. కొందరు నేతలైతే షర్మిలకోసం దేవాలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు.