పవన్ కటాక్షం కోసం అగ్ర నేతల ఆరాటం!
సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టబోతున్నారా? ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ విషయాన్ని పక్కపెడితే.. పవన్ టీడీపీలో చేరుతున్నారంటూ కొన్నాళ్ల క్రితం మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. పవన్ టీడీపీ నేతలతో టచ్ లో ఉండడంతో అలా వదంతులు వినిపించాయి. అప్పుడు పవన్ దాన్ని ఖండించారు. అయితే, రాజకీయాల్లోకి రావాలని, సేవ చేయాలని ప్రస్తుతం పవన్ లోలోపల ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై, పార్టీ ఏర్పాటుపై మరోసారి తార స్థాయిలో జనబాహుళ్యంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఈ నెల రెండో వారంలో మీడియాతో మాట్లాడతారంటూ ఒక ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను టీడీపీలోకి చేర్చుకోవడం లేదా పార్టీ తరఫున ప్రచారం చేసేలా ఒప్పించడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పవన్ తో చర్చించాలని తన సన్నిహిత నేతలకు చెప్పారని రాజకీయ వర్గాల సమాచారం. వారు పవన్ ను సంప్రదించగా.. ఆయన్నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదని తెలిసింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ సన్నిహితులు కూడా పవన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సందేహాలకు పవన్ ప్రకటనే తెరదించాల్సి ఉంది!