చిన్నమ్మ, పెద్దమ్మ అంటే సాగిపోతుందా?..తెలుగు ప్రజల్ని చాలా నీచంగా చూస్తున్నారు: సుజనా చౌదరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిన్నమ్మ, పెద్దమ్మ అంటే సాగిపోతుందా?..తెలుగు ప్రజల్ని చాలా నీచంగా చూస్తున్నారు: సుజనా చౌదరి

చిన్నమ్మ, పెద్దమ్మ కూడబలుక్కుని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామంటే సాగిపోతుందా? అని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని, బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్ ను నిలదీశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో తెలుగు ప్రజల్ని చాలా నీచంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించడాన్ని తాము తప్పు పట్టడం లేదని, అయితే ప్రకటించిన విధానమే న్యాయసమ్మతం కాదని ఆయన మండిపడ్డారు.

ఎమర్జెన్సీ రోజుల్ని తలపిస్తూ పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో బిల్లును అడ్డుకునేందుకు సరిపడా నెంబర్ లేదని తమను చిన్న చూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం ఏడు పార్టీలు బిల్లును అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎవరు ఎవర్ని నీచంగా చూస్తారో తెలుస్తుందని సుజనా చౌదరి సవాలు విసిరారు.

More Telugu News