Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ వాదుల బెయిల్ పిటిషన్ తిరస్కరణ

సడక్ బంద్ కార్యక్రమంలో అరెస్టయిన తెలంగాణ ఐకాస కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం తదితరులకు ఏప్రిల్ 4వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, కోదండరాం పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై విచారణను శనివారానికి వాయిదా వేసింది. 

ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై సడక్ బంద్ నిర్వహించడంతో, వీరిని అదుపులోకి తీసుకున్నారు. మానవపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్ రేంజి డీఐజీ నాగిరెడ్డి తెలిపారు. ఈ కేసులో కోదండరాంతో పాటు ఈటెల, జూపల్లి, రాజేందర్ గౌడ్ తదితరులు అరెస్టయ్యారు. 

More Telugu News