తిరుమలలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన ముప్పు

తిరుమలలోని పాపవినాశనం ఘాట్ రోడ్డు మార్గంలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. తిరుమల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మధ్యాహ్నం 38 మంది ప్రయాణికులతో పాపవినాశనం నుంచి తిరుమలకు బయల్దేరగా.. మార్గమధ్యంలోని ఆకాశగంగ సమీపంలో ఎదురుగా వచ్చిన సుమోను తప్పించబోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో అదుపుతప్పిన బస్సు వంద మీటర్లు వరకు ముందుకు దూసుకెళ్లింది. కుడివైపున ఉన్న పిట్టగోడను ఢీకొని ఆగింది. అప్పటికే బస్సు ముందు చక్రాలు లోయ వైపు గాలిలో ఉన్నాయి. బస్సులోని ప్రయాణికులు ఈ ఘటనతో భయాందోళనతో వణికిపోయారు. 40 అడుగుల లోయలో బస్సు పడి ఉంటే ప్రాణనష్టం భారీగా జరిగేదని ప్రయాణికులు చెప్పారు.

More Telugu News