శ్రీకాకుళం జిల్లాలోని పరిశ్రమలో భారీ విస్పోటనం.. అరకిలోమీటర్ మేర ఎగిరిపడ్డ పరికరాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీకాకుళం జిల్లాలోని పరిశ్రమలో భారీ విస్పోటనం.. అరకిలోమీటర్ మేర ఎగిరిపడ్డ పరికరాలు

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని కాన్ కాస్ట్ పరిశ్రమలో భారీ విస్పోటనం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలోని యంత్ర పరికరాలు చుట్టుపక్కల అర కిలోమీటర్ మేర ఎగిరిపడ్డాయి. ఒక్కసారిగా సంభవించిన ఈ హఠాత్పరిణామంతో పరిసరప్రాంత ప్రజలు భీతావహులయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి హుటాహుటీన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విస్పోటనానికి కారణాలపై విచారణ జరుగుతోంది   

More Telugu News