రాహుల్ గాంధీపై పోటీకి ఏఏపీ రెడీ: కేజ్రీవాల్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నుంచి అభ్యర్థిని నిలబెడతామని ఏఏపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాజాగా రాహుల్ గాంధీ కూడా అవినీతి పరుల జాబితాలో చేరిపోయినందున.. తమ పార్టీ నుంచి అభ్యర్థిని తప్పకుండా పోటీలో ఉంచుతామన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కళంకిత అభ్యర్థుల ఏరివేత లక్ష్యంగా తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలుపుతామని కేజ్రీవాల్ ఇంతకు మునుపే ప్రకటించారు.
తమ ఇమేజ్ ను పెంచుకోవడానికి భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ప్రచార రధసారథి రాహుల్ గాంధీలు 500 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన అన్నారు. దేశంలో అవినీతిని పారద్రోలడానికి నిజాయతీపరులైన రాజకీయ నాయకులు ప్రజలకు అవసరమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.