అవన్నీ అవాస్తవాలే.. నేను వైఎస్సార్సీపీలోనే ఉన్నా: ఎస్పీవై రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవన్నీ అవాస్తవాలే.. నేను వైఎస్సార్సీపీలోనే ఉన్నా: ఎస్పీవై రెడ్డి

తాను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతున్నానని, వైఎస్ జగన్ తో కలసే ముందుకు వెళుతున్నానని నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి స్పష్టం చేశారు. తనపై కొన్ని టీవీ ఛానెళ్లు అవాస్తవ కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆయన చెప్పారు. తనను మరోమారు వివాదాల్లోకి లాగవద్దని ఎస్పీవై రెడ్డి సూచించారు.

ముఖ్యమంత్రి కిరణ్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మాట వాస్తవమేనని, తన వ్యక్తిగత పనిపై సీఎం కార్యదర్శిని కలిసేందుకు వెళ్లినట్టు ఎస్పీవై రెడ్డి చెప్పారు. తన నిజాయతీని శంకించాల్సిన పని లేదని.. మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న తనను ఎంపీగా పోటీ చేయాలని దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సహించారని ఆయన చెప్పుకొచ్చారు. తాను మనస్ఫూర్తిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

More Telugu News