Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాసనసభ ప్రారంభం..అరగంట పాటు వాయిదా

శాసనసభ ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఇరుప్రాంతాలకు చెందిన సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలతో సభను హోరెత్తించారు. సీఎం నోటీసును తిరస్కరించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు ఆందోళన చేపట్టారు. ఆందోళన విరమించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకపోవడంతో అరగంట పాటు సభను వాయిదా వేశారు.

More Telugu News