ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన ముసాయిదా బిల్లుపై రాష్ట్రపతి నిర్దేశించిన చివరి తేదీ వరకు చర్చ జరగాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, స్పీకర్ తో తాను మాట్లాడుతానని, బిల్లుపై సభలో చర్చ జరగాలని అన్నారు. కాగా సభలో సజావుగా చర్చ జరుగుతుండడం విశేషం.