భారత వైమానిక దళంలో పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సికింద్రాబాద్ ఎంపిక విభాగం అధికారి దీపేష్ తెలిపారు. అడ్మిషన్ అసిస్టెంట్, అకౌంట్స్ అసిస్టెంట్, లాజిస్టిక్స్ అసిస్టెంట్, ఎన్విరాన్ మెంట్ సపోర్ట్ సర్వీసెస్ అసిస్టెంట్, కమ్యూనికేషన్ టెక్నీషియన్, మెట్రోలాజికల్ అసిస్టెంట్, మెడికల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇంటర్ తోపాటు సంబంధిత విభాగంలో ఏదేనీ గుర్తింపు పొందిన టెక్నికల్ కోర్సు చేసి ఉండాలి. దరఖాస్తులకు ఈ నెల 27 చివరి తేదీ. వివరాలకు www.indianairforce.nic.in సైట్ ను చూడొచ్చని దీపేష్ తెలిపారు.