వేములవాడ ఆలయానికి లక్షలాదిగా భక్తులు
కరీంనగర్ జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరుడి సన్నిధానానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ ఉదయం స్వామి దర్శనం కోసం లక్షకు పైగా భక్తులు తరలిరావడgతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. దీంతో భక్తులందరికీ దర్శనం కల్పించే ఉద్దేశంతో అధికారులు ప్రత్యేక సేవలను రద్దు చేశారు.