టీఆర్ఎస్ నేతలపై మెదక్ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఉన్న సమయంలో తనను వెన్నుపోటు పొడిచేందుకు చూశారని ఆరోపించారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ 'నేను ఎప్పుడు చస్తానా అని కొందరు టీఆర్ఎస్ నేతలు ఎదురు చూశారని' అన్నారు. టీఆర్ఎస్ లో ఉన్నంత కాలం తనను ఇబ్బంది పెట్టాలని చూశారే తప్ప ప్రజాప్రయోజనాల గురించి పట్టించుకోలేదని ఆమె విమర్శించారు.