సమైక్య ఉద్యమం కోసం కాకుడా సీమాంధ్ర కోసం పోరాడాలని తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం సూచించారు. వరంగల్ నిట్ లో తెలంగాణ నెటిజన్స్ ఫోరం ఆదివారం నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి నైతికత ఉంటే పదవికి రాజీనామా చేసి పోరాడాలని అన్నారు. దురుద్దేశంతోనే సీమాంధ్ర నేతలు గడువు కోరుతున్నారని కోదండరాం ఆరోపించారు.