సునందాపుష్కర్ మరణానికి కేంద్ర మంత్రి థరూరే కారణమా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సునందాపుష్కర్ మరణానికి కేంద్ర మంత్రి థరూరే కారణమా?

కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి అనుమానాస్పదమేనని పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె మరణానికి కారణాన్ని అన్వేషించే పనిలో దర్యాప్తు అధికారులు మునిగిపోయారు. తన భర్త, కేంద్ర మంత్రి శశిథరూర్ కు పాకిస్థానీ జర్నలిస్టు తరార్ తో సంబంధం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసిన మర్నాడే సునంద హఠాన్మరణానికి గురైన సంగతి తెలిసిందే.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సునందపుష్కర్ ఇటీవల (ఈ నెల 13, 14తేదీలలో) తన భర్త ధరూర్ తో కలిసి తిరువనంతపురంలోని కేరళ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో ఫ్లయిట్ లో వాళ్లిద్దరికీ తీవ్ర వాదులాట జరిగింది. వారిద్దరి మధ్య ఘర్షణను అదే ఫ్లయిట్ లో ఉన్న మరో కేంద్ర మంత్రి మనీష్ తివారీ కూడా చూసినట్లు సమాచారం. తరార్ విషయం బయటపడ్డాక గత ఆరు నెలలుగా సునంద, థరూర్ మధ్య ఘర్షణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. థరూర్ దంపతుల మధ్య ఘర్షణ జరిగినట్లు వారి దగ్గర పని చేసే నారాయణ్ అనే పనిమనిషి కూడా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశాలే సునంద మరణానికి కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ధరూర్ ను పోలీసులు రేపు ప్రశ్నించనున్నారు.

More Telugu News