తల అనుకుని కాలు నరికేశాడు!
భార్యపై అనుమానంతో ఓ భర్త హత్యాయత్నం చేశాడు. విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిథిలోని అంబాపురంలో కుంబా దుర్గాదేవి (23)కి సాంబశివరావుతో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కొంత కాలంగా ఎదురింటి శ్రీనివాసరావుతో తన భార్యకి వివాహేతర సంబంధం ఉందని సాంబశివరావు అనుమానిస్తున్నాడు. దీంతో దుర్గాదేవి, సాంబశివరావు మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో గత రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. దీంతో సాంబశివరావు తన భార్యను ఎలాగైనా హత్య చేయాలని పథకం రచించాడు.
దుర్గాదేవి రాత్రి రెండు గంటల సమయంలో బాత్రూంకి వెళ్లివచ్చి తలవైపు కాళ్లు పెట్టుకుని దుప్పటి కప్పుకుని పడుకుంది. అదే అదనుగా భావించిన సాంబశివరావు వేటకత్తితో తలవైపు నరికాడు. ఒక్కసారిగా కాలు తెగిపోవడంతో దుర్గాదేవి పెద్దగా కేకలు వేసింది. దీంతో కగారుపడి తలవైపు నరికాడు. చేతులు అడ్డుపెట్టుకోవడంతో చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఆమె ఆర్తనాదాలకు లేచిన చుట్టపక్కల వాళ్లు ఆమెను ఆసుపత్రికి తరలించారు. తెగిపడిన ఆమె కాలును ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి స్ధిరంగా ఉంది.