ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వెంకన్న దర్శనానికి కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఇవాళ శనివారం, వారాంతం కావడంతో క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులతో వైకుంఠం 1, 2లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.