రాష్ట్రవిభజన బిల్లుపై చర్చకు గడువు పెంచవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. ఆ లేఖలో బిల్లుపై చర్చకు ఇచ్చిన 40 రోజుల సమయం వృధా చేశారని, అందుకే అదనపు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన లేఖలో సూచించారు.