ముస్లిం మహిళలు తమ భర్త కనిపించకుండా పోయి 4 ఏళ్లయినా ఆచూకీ లేకపోతే పునర్వివాహం చేసుకునేందుకు అనుమతిస్తూ జమ్మూ కాశ్మీర్లో ఫత్వా జారీ అయింది. ముస్లిం మత సంస్థలు ఒక సమావేశాన్ని నిర్వహించిన అనంతరం ఈ ఫత్వా జారీ చేశాయి. తాము ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎహ్సాస్ అనే స్వచ్చంద సంస్థ అధిపతి బషీర్ అహ్మద్ తెలిపారు.