తమ సామాజిక వర్గానికి చెందిన యువతితో మాట్లాడినందుకు... ఓ యువకుడిని అత్యంత పాశవికంగా శిక్షించారు. అతి దారుణంగా కొట్టడమే కాకుండా, గాజు పెంకుతో అతని పురుషాంగాన్ని కోసివేశారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని బంట్వాళలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... జైరామ్ అనే యువకుడు ఆదివారం ఓ యువతితో మాట్లాడుతుండగా... ఆ అమ్మాయి బంధువులు, ఆమె సామాజిక వర్గానికి చెందిన పలువురు అక్కడకు చేరుకున్నారు. ఆ అమ్మాయిని అక్కడ నుంచి పంపించి, జైరామ్ ను దుస్తులు ఊడదీసి, చితగ్గొట్టి, పురుషాంగాన్ని కోసివేశారు. అంతేకాకుండా, ఈ సన్నివేశాన్ని మొత్తం మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు.
తీవ్ర రక్తస్రావంతో జైరామ్ స్పృహ తప్పి పడిపోగా, చనిపోయాడని భావించి వారంతా పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, జైరామ్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.