రేపు (గురువారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో వైఎస్సార్సీపీ అధినేత జగన్ భేటీ కానున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరేందుకే సమావేశమవుతున్నారని తెలిసింది. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ రాష్ట్రపతికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అఫిడవిట్లు సమర్పించనున్నారు.