రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ సాయంత్రం రాజ్ భవన్ లో జరిగే విందుకు హాజరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ ఇచ్చే ఆతిథ్యాన్ని ప్రణబ్ స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి 7.20 నిమిషాల నుంచి 8.10 వరకు జంట నగరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బొల్లారం రాష్ట్రపతి భవన్ నుంచి రాజ్ భవన్ మార్గంలో ఆంక్షలు అమలులో ఉంటాయని, వాహనదారులు సహకరించాలని పోలీసులు ప్రకటనలో తెలిపారు. బొల్లారం, లోతుకుంట, తిరుమలగిరి, ఎన్ సీసీ డైరెక్టరేట్ మీదుగా రాజ్ భవన్ వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.