ఢిల్లీ ముఖ్యమంత్రిగా అవతరించనున్న కేజ్రీవాల్ కు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభినందనలు తెలిపారు. కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటం హర్షణీయమని తెలిపారు. తమ నిర్ణయంతో కేజ్రీవాల్ ప్రజాస్వామ్య వ్వవస్థను బలోపేతం చేశారని కొనియాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏఏపీ ప్రకటించిన అనంతరం, డిగ్గీరాజా ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.