మనం రోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం పీచు పదార్ధం ఉండేలా చూసుకుంటే మనం చక్కగా ఆరోగ్యంగా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పీచు పదార్ధం ఎంతగానో తోడ్పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
లీడ్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దాదాపుగా రెండు దశాబ్దాలుగా ప్రచురించిన పలు పరిశోధనా పత్రాలను విశ్లేషించి కనుగొన్న విషయం ఏమంటే, పీచు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం గుండెకు సంబంధించిన జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చు.
ప్రతిరోజూ సుమారు ఏడు గ్రాములకుపైగా పీచు పదార్ధం ఉండేలా పళ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల కార్డియో వాస్కులర్ డిసీజెస్, కరొనరీ హార్ట్ డిసీజెస్ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం గమనించామని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి పిండి పదార్ధాలతోబాటు పీచు ఎక్కువగా ఉండే పదార్ధాలకు కూడా మన ఆహారంలో భాగం కల్పిస్తే చక్కటి ఆరోగ్యంతో ఉండవచ్చు.