మరో గంటలో స్పీకర్ కు తెలంగాణ బిల్లు ముసాయిదా: సీఎం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో గంటలో స్పీకర్ కు తెలంగాణ బిల్లు ముసాయిదా: సీఎం

మరో గంటలో స్పీకర్ కు తెలంగాణ బిల్లు ముసాయిదా అందుతుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్ 371-డీ సవరణపై బిల్లులో ప్రస్తావించారని సీఎం వెల్లడించారు. సభలో చర్చపై బీఏసీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. బిల్లులో పేర్కొన్న ప్రతి క్లాజ్ పై చర్చ, ఓటింగ్ జరగాలని ఆయన తెలిపారు. బిల్లుపై రాష్ట్రపతి ఇచ్చిన గడువు సరిపోతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని సీఎం చెప్పారు. బిల్లుపై సీక్రెట్ అని రాసి ఉన్నందున టేబుల్ ఐటెంగా ఇవ్వాలా? లేక వ్యక్తిగతంగా ఇవ్వాలా? అనేదానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి వివరించారు.

More Telugu News