తూర్పు ఢి్ల్లీ. మంగళవారం రాత్రి 7 గంటలు అవుతోంది. విహార్ ప్రాంతంలో ఫ్లైఓవోర్ పై నుంచి ఒక యవతి బిగ్గరగా అరుస్తూ కిందకు దూకేసింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి కొట్టుకుంటోంది. పోలీసులు అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఇంతకూ ఏం జరిగింది?

అనిత, వాసిం ఇద్దరూ ప్రేమికులు. వాసిం స్థానికంగా మొబైల్ షాపులో పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య ఐదేళ్ల పరిచయం. ప్రేమ కూడా నడుస్తోంది. ఇటీవల అనిత తన అమ్మకు ఆరోగ్యం బాలేకపోవడంతో స్వస్థలం ఆగ్రాకు వెళ్లింది. వాసిం మరో అమ్మాయిని వివాహమాడే ప్రయత్నంలో ఉన్నాడని తెలుసుకుని ఢిల్లీకి వచ్చింది. వాసింను నిలదీసింది. ఇద్దరూ కలిసి ఫ్లైవోవర్ పైకి వెళ్లారు. అక్కడే వాదులాడుకున్నారు. 'ఏదీ ఈ ఫ్లైఓవర్ నుంచి కిందకు దూకు. నీ ప్రేమను నిరూపించుకో?' అని వాసిం అనితతో అన్నాడు. క్షణం ఆలోచించకుండా దూకేసింది. పోలీసులు వాసింను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.