మైసూర్ రాజకుటుంబానికి చెందిన శ్రీకంఠదత్త వడయార్ గుండెపోటుతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. మైసూర్ సంస్థానాన్ని పరిపాలించిన మహారాజు జయచామ రాజేంద్ర వడయార్ కుమారుడైన శ్రీకంఠదత్త 1953లో జన్మించారు. ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున మైసూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. శ్రీకంఠ పూర్తి పేరు శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ బహదూర్. వడయార్ మృతితో మైసూర్ రాజకుటుంబం విషాదంలో మునిగిపోయింది.