పది సంవత్సరాల తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి విజయోత్సాహంతో ఉన్న బీజేపీ, కొత్తగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజార్టీనీ దక్కించుకోకపోవడం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీకి మద్ధతివ్వబోమని ఏఏపీ కరాఖండిగా తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో, ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాలే ఢిల్లీ ముఖ్యమంత్రి కావాలంటోంది జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ). ఈ మేరకు తాము బేషరతు మద్దతిస్తామని ఆ పార్టీ నేత కేసీ త్యాగీ చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో జేడీయూ ఒక్క సీటు గెల్చుకుంది. అప్పుడు ఏఏపీకు మద్దతిస్తే వారి సంఖ్య 29కు చేరుతుంది.