హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యంను తెలుగువారు కోల్పోయిన రోజే హిందీ, మరాఠీ కేరెక్టర్ ఆర్టిస్ట్ వినయ్ ఆప్టే కూడా హఠాన్మరణం చెందారు. శ్వాసపరమైన సమస్యలతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఎన్నో హిందీ, మరాఠీ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ఎంతో మంది అభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నారు. టీవీల్లోనూ కనిపించారు. ఒక హిందీ సినిమా షూటింగ్ కోసమని సెప్టెంబర్ లో ఆయన సిమ్లాకు వెళ్లి వచ్చినప్పటి నుంచి శ్వాసపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో చేరగా.. మరుసటి రోజే ఆయన పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.