మాటలు సరిగా రాకపోవడం, నలుగురితో కలవలేకపోవడం వంటి సమస్యలతో బాధపడే ఆటిజం పిల్లల్లో లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్ తో మంచి మార్పు తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆక్సిటోసిన్ ను నాసల్ (మక్కు) స్ప్రే ద్వారా ఇచ్చినట్లయితే మెదడు పనితీరు మెరుగు పడుతుందని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు తెలిపారు. ఆటిజం సమస్యలతో బాధపడే చిన్నారుల మెదడు పనితీరుపై ఆక్సిటోసిన్ ప్రభావం గురించి తెలుసుకోవడం ఇదే ప్రథమమని ఇలానిత్ గోర్డాన్ చెప్పారు. 17 మంది ఆటిజం బాధితులపై ఈ పరిశోధన జరిగింది.