Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెన్సార్ బోర్డు అధికారిణి ధనలక్ష్మిపై మరోసారి వర్మ పిటిషన్

సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారిణి ధనలక్ష్మిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి హైదరాబాదు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. తన(వర్మ) దర్శకత్వంలో రూపొందిన 'సత్య-2' చిత్రం రిలీజ్ కాకుండా సెన్సార్ పేరుతో ధనలక్ష్మి అడ్డుకోవాలని చూస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయమై వర్మ రెండుసార్లు పిటిషన్ వేయగా కోర్టు వాటిని తోసిపుచ్చింది. తాజాగా, మరోసారి పిటిషన్ వేయడం గమనార్హం.

More Telugu News