నిశ్శబ్ద హెలికాప్టర్
సాధారణంగా హెలికాప్టర్ నేలమీద దిగే సమయంలోగానీ, గాలిలోకి ఎగిరే సమయంలోగానీ చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తుంది. అలాగే హెలికాప్టర్లు వదిలే ఉద్గారాలతో వాతావరణం కలుషితమైపోతుంది. అలాకాకుండా ఎలాంటి శబ్దం చేయకుండా, వాతావరణానికి హాని కలిగించే ఉద్గారాలను వదలకుండా ఉండే సరికొత్త హెలికాప్టర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఈ-వోలో అనే కంపెనీ ఈ సరికొత్త హెలికాప్టరును తయారుచేసింది. ఈ హెలికాప్టర్ సాధారణ హెలికాప్టరులాగా కనిపించినా, వాటికన్నా భిన్నంగా ఉంటుందని ఈ కంపెనీ చెబుతోంది. తమ వోలోకాప్టర్ పైకెగిరేటప్పుడుగానీ, కిందికి దిగేటప్పుడుగానీ చెవులు చిల్లులు పడేలా శబ్దం వెలువడదని, అలాగే వాతావరణాన్ని కలుషితం చేసే ఉద్గారాలు వెలువడకుండా దీన్ని రూపొందించామని కంపెనీ ఎండీ అలెగ్జాండర్ జోసెల్ వివరించారు. ఈ హెలికాప్టర్లో మామూలు హెలికాప్టర్లలో ఉపయోగించే ఇంజను స్థానంలో విద్యుత్తుతో నడిచే 18 రోటర్లను అమర్చామని, దీనివల్ల ఎక్కువ శబ్దం వెలువడదని, ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించేలా దీన్ని రూపొందించామని, దీనిలో ప్రయాణించే సమయంలో ప్రకంపనలు కూడా తక్కువ స్థాయిలో ఉంటాయని అలెగ్జాండర్ తెలిపారు. తాము రూపొందించిన ఈ పర్యావరణ హిత వోలోకాప్టర్కోసం ఆర్డర్లు బాగానే వస్తున్నాయని కంపెనీ చెబుతోంది.