ఆ ఫుటేజ్ దొరికింది.. మా అభ్యర్థులు తప్పు చేయలేదు: ఏఏపీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ ఫుటేజ్ దొరికింది.. మా అభ్యర్థులు తప్పు చేయలేదు: ఏఏపీ

న్యూఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులపై జరిపిన స్టింగ్ ఆపరేషన్ ను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. స్టింగ్ ఆపరేషన్ అంటూ వెల్లడించిన ఫుటేజ్ ను ప్రత్యర్థి వర్గం కుట్రగా అభివర్ణించింది. మీడియా సర్కార్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన ఫుటేజ్ లు తమ చేతికి అందాయని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. స్టింగ్ ఆపరేషన్ ఫుటేజ్ లను తాము క్షుణ్ణంగా పరిశీలించామని ఆ పార్టీ తెలిపింది. తమ పార్టీ అభ్యర్థులు ఎక్కడా ఎటువంటి తప్పులూ చేయలేదని పరిశీలనలో తేలిందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. తమ పార్టీ అభ్యర్థులపై ఏ చర్యలు ఉండవని ఆ పార్టీ స్పష్టం చేసింది.

More Telugu News